: వరల్డ్ క్రికెట్ లో టీమిండియా ఆధిపత్యం ఐదేళ్ల పాటు కొనసాగాలి: టెస్టు కెప్టెన్ కోహ్లీ
ప్రపంచ క్రికెట్ లో టీమిండియా ఆధిపత్యం కనీసం ఐదేళ్ల పాటైనా కొనసాగాలని టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. అందుకోసం తమ ప్రయత్నాలు కూడా సరైన రీతిలోనే సాగాల్సి ఉందని అతడు వ్యాఖ్యానించాడు. ‘‘టీమిండియా ఆటగాళ్లలో నైపుణ్యానికి కొదవేమీ లేదు. నెంబర్ వన్ గా నిలిచే సామర్ధ్యం మాకు ఉంది. అందుకే వరల్డ్ క్రికెట్ పై టీమిండియా ఆధిపత్యం కనీసం ఐదేళ్లపాటైనా కొనసాగాలి’’ అని అతడు వ్యాఖ్యానించాడు. ఇక జట్టు సభ్యులతో మరింత స్నేహపూరిత సంబంధాలను కోరుకుంటున్నానని కూడా అతడు అన్నాడు. ఏడాదిలో కనీసం 290 రోజులు కలిసే ఉంటున్న నేపథ్యంలో ఆ మాత్రం స్నేహ సంబంధాలు జట్టు సభ్యుల మధ్య అవసరమని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.