: వాళ్లు హిందువులు కాదు... తొలగించాల్సిందే: స్వరూపానంద సరస్వతి


శంకరాచార్య స్వరూపానంద సరస్వతి మరో వివాదానికి తెరలేపారు. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం కేదారానాథ్ ఆలయ పూజారులు హిందువులు కాదని వ్యాఖ్యానించారు. వారిని తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఉత్తరాఖండ్ లోని చమోలిలో మీడియాతో మాట్లాడుతూ... కేదార్ నాథ్ హిందూ దేవాలయమని, అయితే, పూజారులు లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారని అన్నారు. లింగాయత్ సామాజిక వర్గీయులు తమను తాము హిందువులుగా పరిగణించరని, అలాంటప్పుడు వారెలా పూజారులుగా కొనసాగుతారని ప్రశ్నించారు. బద్రీనాథ్ క్షేత్ర పూజారులకూ ఇది వర్తిస్తుందని అన్నారు. బద్రీనాథ్ ఆలయం తలుపులు మూసివేసిన తర్వాత, పూజారులు జోషిమఠ్ లో ఉండాల్సింది పోయి, దేశ సంచారం చేస్తున్నారని విమర్శించారు. వారి తీరు బద్రీనాథ్ పవిత్రతను దెబ్బతీసే విధంగా ఉందని శంకరాచార్య అభిప్రాయపడ్డారు. వారు స్వల్ప కాలం బ్రహ్మచర్యం పాటించి, ఆపై పెళ్లిళ్లు చేసుకుంటున్నారని కూడా దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News