: ఈ చేప చాలా డిఫరెంటు... చెట్లు కూడా ఎక్కుతుంది!
మనుషులు భూమిపై నడుస్తారు, చేపలు నీటిలో ఈదుతాయి! తెలిసిన విషయమే. మరి, నీటిలో ఉండాల్సిన చేప నేలపైకి వస్తే...! ఎక్కువ సమయం బతకలేదనే అందరూ చెబుతారు. కానీ, ఈ చేప చాలా డిఫరెంటు. పేరు క్లైంబింగ్ పెర్చ్. పేరుకు తగ్గట్టే చెట్లు ఎక్కుతుంది. పాపువా న్యూగినియా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ మత్స్యరాజం భూమిపైనా చరించగలదు. పాక్షిక ఉభయచరం అన్నమాట. రోజుల తరబడి నేలపైనే ఉండగల సామర్థ్యం దీని సొంతం. ఇది పెక్టోరల్ మొప్పల సాయంతో నడుస్తుంది. నీటి నుంచి వెలుపలికి వచ్చినా ఓ ప్రత్యేకమైన అవవయంతో శ్వాసించగలదు. 2005లో బోయిగు, సైబాయ్ దీవుల వద్ద క్లైంబింగ్ పెర్చ్ ను కనుగొన్నారు. ఈ చేపలు ఎంత గట్టివంటే... తమను పక్షులు, పెద్ద చేపలు మింగితే, వాటి పొట్టలోకి వెళ్లినా తమ మూతులతో గుచ్చి, పళ్లతో కొరికి చికాకుపెడతాయట.