: విజయవాడలో జగన్ దిష్టిబొమ్మ దహనం చేసిన టీడీపీ


ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సమరదీక్షకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసనలు, దీక్షలు చేపట్టారు. ఈ మేరకు విజయవాడ, మంగళగిరిలో నిరసనలు చేస్తున్నారు. జగన్ దిష్టిబొమ్మ దహనం చేసి, జగన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళుతుంటే జగన్ చూసి ఓర్వలేక పోతున్నారని టీడీపీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లా కేంద్రాల్లో కూడా జగన్ దీక్షకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News