: మీదంతా ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమే!... వైసీపీ, టీఆర్ఎస్ పై సోమిరెడ్డి ఫైర్


తెలంగాణలో అధికార టీఆర్ఎస్, ఏపీలో ప్రతిపక్ష వైసీపీలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైరయ్యారు. ఓటుకు నోటు వ్యవహారంలో టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి అరెస్ట్, తమ పార్టీ అధినేత చంద్రబాబును ఈ కేసులో ఇరికించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు కుట్ర చేస్తున్న వైనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి టీఆర్ఎస్, వైసీపీల కుట్రపూరిత వైఖరిపై విరుచుకుపడ్డారు. రెండు పార్టీల అధినేతలదీ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమేనని ఆయన ఆరోపించారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిన జగన్, చంద్రబాబుపై విమర్శలు గుప్పించడం సరికాదన్నారు. 13 కేసుల్లో ప్రధాన ముద్దాయిగా ఉన్న జగన్ కు వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగే హక్కు కూడా లేదన్నారు. తక్షణమే అధ్యక్ష పదవి నుంచి దిగి, పార్టీ నేతల్లో ఎవరినో ఒకరిని అధ్యక్షుడిని చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సెంటిమెంట్ పేరు చెప్పి అధికారం చేపట్టిన కేసీఆర్, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడం లేదన్నారు. కుటుంబ ఆస్తులు పెంచుకునేందుకు కేసీఆర్ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. అసలు కేసీఆర్ ఏ పార్టీలో పుట్టి పెరిగారో గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా, టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరని సోమిరెడ్డి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News