: బొత్స సత్తిబాబును ఓడించి తీరాలి... టీడీపీ నేతలకు చంద్రబాబు హుకుం


కాంగ్రెస్ కు చేయిచ్చి వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధపడ్డ మాజీ మంత్రి, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి పోటీని ఎదుర్కోనున్నారు. అదేంటీ, ఇంకా పార్టీ మారనే లేదు, అప్పుడే బొత్సకు ఎమ్మెల్సీ టికెట్ వస్తుందా? అనేగా మీ అనుమానం. తప్పక వచ్చి తీరుతుంది, ఆ మాత్రం హామీ లేకుంటే ఆయన పార్టీ ఎందుకు మారతారు? ఆది నుంచి బొత్స వ్యవహార సరళి అంటే నచ్చని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గ ఇన్ చార్జీలతో జరిపిన టెలీ కాన్ఫరెన్స్ సందర్భంగా బొత్సకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచిస్తూనే బొత్సకు దిమ్మతిరిగేలా ఓటమి చవిచూపించాలని చంద్రబాబు నేతలను ఆదేశించారట. విజయనగరం జిల్లా నుంచి ఎమ్మెల్సీ బరిలో నిలవనున్న బొత్సను ఓడించి తీరాల్సిందేనన్న చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ నేతలు వెనువెంటనే రంగంలోకి దిగిపోయారు. అంటే, రానున్న ఎన్నికల్లో బొత్స సత్తిబాబు చెమటోడ్చక తప్పదన్నమాట.

  • Loading...

More Telugu News