: పాకిస్థాన్ అభివృద్ధిని చూసి భారత్ ఓర్వలేకపోతోందట!
భారత్ పై పాకిస్థాన్ మరోసారి అవాకులుచెవాకులు పేలింది. భారత్ నిజస్వరూపం బట్టబయలైందంటూ పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి నిసార్ అలీ ఖాన్ వ్యాఖ్యానించారు. చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టును భారత్ వ్యతిరేకించడమే అందుకు నిదర్శనమని, పొరుగుదేశం అభివృద్ధిని చూసి భారత్ ఓర్వలేకపోతోందని ఆరోపించారు. పాక్ ఎదుగుతుండడాన్ని భారత్ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. పాక్ ను అస్థిరతలోకి నెట్టాలన్నదే భారత్ ప్రయత్నంగా కనిపిస్తోందని అన్నారు. ఇటీవల కాలంలో పాక్ కు చైనా భారీగా ఆర్థికసాయం చేస్తోంది. అప్పటినుంచి, పాక్ అధినాయకత్వం తరచూ భారత్ ను విమర్శించడమే పనిగా పెట్టుకుంది.