: లిక్కర్ ’కింగ్‘ బీరు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం...నలుగురు కార్మికులకు గాయాలు


లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు కాలం కలిసి రావట్లేదు. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఆయన బీరు కంపెనీ యునైటెడ్ బ్రూవరీస్ పై తాజాగా తెలంగాణలో కేసు నమోదైంది. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కొత్లాపూర్ లోని యూబీ గ్రూప్ నకు చెందిన బీరు ఫ్యాక్టరీలో గత రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. రాత్రి వేళ సంభవించిన ఈ ప్రమాదంలో కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సమయంలో కంపెనీలో విధి నిర్వహణలో ఉన్న నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన విషయాన్ని గోప్యంగా ఉంచిన కంపెనీ యాజమాన్యం, బాధిత కుటుంబాలకు కూడా సమాచారమివ్వలేదట. దీంతో క్షతగాత్రుల బంధువులు కంపెనీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గాయపడ్డవారిని ప్రస్తుతం సంగారెడ్డిలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News