: ఆర్బీఐ... ఛీర్ లీడర్ కాదు: మీడియాపై రఘురామ రాజన్ ఫైర్!


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ రాజన్ నిన్న మీడియాపై విరుచుకుపడ్డారు. మార్కెట్లను ఉత్సాహపరచడానికి ఆర్బీఐ ఛీర్ లీడరేమీ కాదని ఆయన కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో విశ్వాసాన్ని నింపడమే తమ పని అన్న రాజన్, ఏ ఒక్కరినో సంతృప్తిపరిచేందుకు తాము పరిమితం కాలేమని తేల్చిచెప్పారు. నిన్న ద్వైమాసిక సమీక్ష అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన రాజన్, పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘పెట్టుబడులకు ఊతమిచ్చేందుకే పాలసీ రేటు (రెపో)ను తగ్గించాం. అసలు రేట్ల తగ్గింపులో మేం కొంత పొరపాటు చేశామనిపిస్తోంది’’ అని ఆయన చెప్పారు. రెపో రేటును అరశాతం కాకుండా పావు శాతం తగ్గించారేమిటన్న మీడియా ప్రశ్నపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాజన్, ఎవరినో మెప్పించడానికి ఆర్బీఐ ఛీర్ లీడరేమీ కాదు అని అన్నారు. తమ పాలసీ నిర్ణయాలకు అనుగుణంగా బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను మరింత తగ్గించాల్సి ఉందని కూడా రాజన్ అభిప్రాయపడ్దారు. డిపాజిట్లపై వడ్డీ రేటు తగ్గించినపుడు, రుణాలపై రేటును కూడా తగ్గించాల్సిందే కదా? అని ఆయన బ్యాంకుల తీరును తప్పుబట్టారు.

  • Loading...

More Telugu News