: తెలంగాణ ప్రజలకు ‘మంచు’వారి ఆవిర్భావ దినోత్సవ గ్రీటింగ్స్!


తెలంగాణ తొలి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు టాలీవుడ్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు గ్రీటింగ్స్ చెప్పారు. ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన మోహన్ బాబు, తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. సంపూర్ణేష్ బాబు హీరోగా మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ నిర్మించిన ‘సింగం-123’ చిత్రం ఆడియో ప్లాటినం డిస్క్ వేడుక నిన్న హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మోహన్ బాబు తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు జోహార్లు అర్పించారు.

  • Loading...

More Telugu News