: పల్టీ కొట్టిన మరో వోల్వో బస్సు... ఇద్దరి మృతి, పలువురికి గాయాలు


తెలుగు రాష్ట్రాల పరిధిలో వోల్వో బస్సు ప్రమాదాలకు అడ్డుకట్ట పడేలా లేదు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో జరిగిన వోల్వో బస్సు ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా, నిన్న రాత్రి ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకున్న వోల్వో బస్సు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. విశాఖ నుంచి చెన్నైకి 42 మంది ప్రయాణికులతో బయలుదేరిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కల్కివాయి వద్ద డివైడర్ ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడ్డ 14 మందిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను పోలీసులు ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన మరుక్షణమే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.

  • Loading...

More Telugu News