: మోత్కుపల్లికి అస్వస్థత... వారం పాటు బెడ్ రెస్ట్ అవసరమన్న వైద్యులు
తెలంగాణ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు నేటి సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. వెనువెంటనే ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. మోత్కుపల్లిని పరిశీలించిన వైద్యులు, భయపడాల్సిందేమీ లేదని చెప్పారు. ఓ వారం పాటు బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని సలహా ఇచ్చారు. దీంతో ముందు కాస్త ఆందోళన చెందిన మోత్కుపల్లి, వైద్యుల పరీక్షల తర్వాత కాస్త ఊపిరి పీల్చుకున్నారు. బీజేపీతో దోస్తీ నేపథ్యంలో మోత్కుపల్లికి గవర్నర్ పదవి ఇవ్వాలని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో చంద్రబాబు మంతనాలు సాగిస్తున్న సంగతి తెలిసిందే.