: నన్ను ఓడించేందుకు రూ.20 కోట్లు వెదజల్లారు: తెలంగాణ మంత్రి తుమ్మల


రెండు రోజుల క్రితం ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి సహా ఐదుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఎమ్మెల్యేల కోటాలో జరిగిన ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రంగంలోకి దిగిన టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డారు. తాజాగా నేటి సాయంత్రం ఖమ్మంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర ప్రకటన చేశారు. తనను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్న ప్రత్యర్థులు దాదాపు రూ.20 కోట్లు ఖర్చు చేశారని ఆయన ఆరోపించారు. అయినా ప్రత్యర్థుల ప్రలోభాలకు లోను కాని తమ పార్టీ ఎమ్మెల్యేలు తనతో పాటు మరో నలుగురికి విజయం అందించారన్నారు. తనపై నమ్మకముంచి కేసీఆర్ మంత్రి పదవి కట్టబెట్టారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు సేవ చేస్తానని తుమ్మల చెప్పారు.

  • Loading...

More Telugu News