: రేవంత్ యత్నం ఫలించి ఉంటే, ఓ ఎమ్మెల్సీ స్థానం టీడీపీ ఖాతాలో పడేదేనట!


ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేల ఓట్ల కోసం టీ టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి నడిపిన మంత్రాంగం ఫలించి ఉంటే, ఓ స్థానం టీడీపీ ఖాతాలో చేరేదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలనే కాక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా రేవంత్ ఓ దారికి తెచ్చారన్న విషయం గుప్పుమనడంతో ఆ రెండు పార్టీల్లో కలకలం రేగింది. స్టీఫెన్ సన్ తో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను టీడీపీ నేతలు తమ దారికి తెచ్చుకున్నారట. అయితే ఎన్నికలకు ఓ రోజు ముందు స్టీఫెన్ సన్ కు స్వయంగా డబ్బు ముట్టజెబుతూ, రేవంత్ రెడ్డి ఏసీబీకి పట్టుబడటంతో ఆ ఎమ్మెల్యేలంతా తమ యత్నాలు విరమించుకున్నారట. కాస్త ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు టీడీపీకి ఓటేసేందుకు సిద్ధపడ్డ తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నాయని విశ్వసనీయ సమాచారం. మరి వారి పేర్లు వెల్లడైతే, ఆ రెండు పార్టీలు సదరు ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకుంటాయోనన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేసింది.

  • Loading...

More Telugu News