: ఏపీలో ఇక ‘స్థానిక’ ఎమ్మెల్సీ సమరం... జూలై 3న పోలింగ్, 7న కౌంటింగ్
ఏపీలో స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు తెర లేచింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోటా కింద మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది. జూలై 3న పోలింగ్ జరగనుంది. అదే నెల 7న ఓట్ల లెక్కంపు జరుగుతుంది. ఈ నెల 9న నోటిఫికేషన్ జారీ చేయనున్న ఎన్నికల సంఘం ఈ నెల 16 వరకు నామినేషన్లను స్వీకరించనుంది. 17 వరకు నామినేషన్ల పరిశీలన జరగనుండగా, 19లోగా నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడంతో ఎన్నికలు జరగనున్న జిల్లాల పరిధిలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.