: బార్ గా మారిన కదిరి ట్రాన్స్ కో ఆఫీస్...ఉదయం లైన్ మెన్లు, సాయంత్రం ఏఈల మందు పార్టీ!


అనంతపురం జిల్లా కదిరిలోని ట్రాన్స్ కో కార్యాలయాన్ని అందులో పనిచేస్తున్న ఉద్యోగులు ఏకంగా బార్ గా మార్చేశారు. పగటి పూటే కార్యాలయంలో దర్జాగా మందుపార్టీ చేసుకుని టీవీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు. ఉదయం కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న లైన్ మెన్లు మందు పార్టీ చేసుకుంటే, సాయంత్రమయ్యేసరికి అసిస్టెంట్ ఇంజినీర్లు కార్యాలయంలో బార్ ఓపెన్ చేశారు. విద్యుత్ సరఫరాకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చిన వినియోగదారుల వైపు మద్యం మత్తు తలకెక్కిన ఉద్యోగులు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వినియోగదారులు సదరు వ్యవహారాన్ని ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ కు ఉప్పందించారు.

  • Loading...

More Telugu News