: మ్యాగీ నూడిల్స్ లో హానికర రసాయనాలేమీ లేవట... బంగ్లాదేశ్ క్లీన్ చిట్!


మ్యాగీ నూడిల్స్ తయారీదారు ‘నెస్లే’కు భారత్ లో రోజుకో ఎదురుదెబ్బ తగులుతోంది. మ్యాగీ నూడిల్స్ లో హానికర రసాయనాలున్నాయన్న ఆరోపణలపై ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వాటిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా కేరళ సర్కారు కూడా మ్యాగి నూడిల్స్ ను నిషేధిస్తూ నేటి మధ్యాహ్నం నిర్ణయం తీసుకుంది. ఇక హర్యానా కూడా వీటి శాంపిళ్లను పరీక్షల నిమిత్తం ల్యాబోరేటరీలకు పంపింది. భారత్ లో ముప్పేట దాడి ఎదుర్కొంటున్న నెస్లేకు బంగ్లాదేశ్ లో మాత్రం ఊరట లభించింది. తాము నిర్వహించిన పరీక్షల్లో మ్యాగీ నూడిల్స్ లో ఎలాంటి హానికర రసాయనాలు లేవని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. మ్యాగీతో పాటు మరో నాలుగు కంపెనీలకు చెందిన నూడిల్స్ కు పరీక్షలు జరిపామని, ఏ ఒక్క కంపెనీ నూడిల్స్ లోనూ హానికర రసాయనాలు లేవని తేలిందని బంగ్లాదేశ్ స్టాండర్డ్స్ అండ్ టెస్టింగ్ ఇన్ స్టిట్యూట్ (బీఎస్టీఐ) డైరెక్టర్ కమల్ ప్రసాద్ దాస్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News