: ఏపీ డీఎస్సీ ఫలితాలు విడుదల... 13 పొరపాట్లను సవరించామన్న మంత్రి గంటా


ఏపీ డీఎస్సీ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో ఈ ఫలితాలను విడుదల చేశారు. 10,313 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత నెల 9, 10, 11 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 3.90 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రశ్నాపత్రంలో మొత్తం 13 పొరపాట్లను గుర్తించామని చెప్పిన మంత్రి, నిపుణుల చేత వాటిని సవరించిన తర్వాతే ఫలితాలను విడుదల చేశామని ప్రకటించారు. ఉద్యోగాలిప్పిస్తామని చెప్పే దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా మంత్రి అభ్యర్థులకు సూచించారు.

  • Loading...

More Telugu News