: మరో సీనియర్ ఐపీఎస్ రాజీనామా... రాజకీయ ఆరంగేట్రం కోసమేనా?


మరో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ తన పదవికి స్వచ్ఛంద విరమణ చేశారు. రాజకీయ ఆరంగేట్రం చేయడం కోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే, నవీ ముంబై పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న కె.లక్ష్మీప్రసాద్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇంకా 11 నెలల సర్వీస్ ఉండగానే ఆయన ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే... మూడు నెలలు పట్టే ఈ కార్యక్రమాన్ని 8 రోజుల్లోనే పూర్తిచేయాలని కోరారు. లక్ష్మీప్రసాద్ నెల్లూరి జిల్లా వాసి. విధినిర్వహణలో ఆయన రాజ్ థాకరేకు ఎదురు నిలిచారు. మచ్చలేని అధికారిగా ఆయనకు పేరుంది.

  • Loading...

More Telugu News