: ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో టీ.స్పీకర్ కు హైకోర్టు నోటీసు


పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి టీడీపీ, కాంగ్రెస్ నేతలు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. దాంతో ఆ ఫిర్యాదులపై నిర్ణయం పెండింగ్ లో పడిపోయింది. తాజాగా ఈ వ్యవహారంపై తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు హైకోర్టుకు వెళ్లాయి. విచారించిన న్యాయస్థానం, స్పీకర్ కు నోటీసు ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై స్పీకర్ ఇంకెంత సమయం తీసుకుంటారో చెప్పాలని నోటీసులో కోరింది. అడ్వకేట్ జనరల్ ద్వారా స్పీకర్ నుంచి సమాచారం తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణను కోర్టు వచ్చేవారానికి వాయిదా వేసిందని న్యాయవాది జంద్యాల రవిశంకర్ తెలిపారు.

  • Loading...

More Telugu News