: గన్నవరం విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ప్రారంభం
విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నవనిర్మాణ దీక్ష రోజు టెర్మినల్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో విశాఖపట్టణం, విజయవాడ, రాజమండ్రి, పుట్టపర్తి, తిరుపతి విమానాశ్రయాలున్నాయని... మూడు విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని అన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా, రాజమండ్రి విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇతర దేశాలతో మన రాష్ట్రాన్ని కలపడమే ముఖ్య లక్ష్యమని చెప్పారు. మరోవైపు, రాజధాని ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ఐదు వేల ఎకరాల భూమిని కేటాయించాలని సింగపూర్ మాస్టర్ ప్లాన్ లో ఉన్న విషయం గమనార్హం.