: ఏదో ఒక రోజు కేసీఆర్ కూడా దొరుకుతారు: భట్టి విక్రమార్క
టీ.టీడీపీ నేత రేవంత్ రెడ్డిలాగే ఏదో ఒకరోజు సీఎం కేసీఆర్ కూడా దొరుకుతారని తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. రేవంత్ వ్యవహారంలోనే కాకుండా టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల విషయంలోనూ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఏపీ, తెలంగాణ సీఎంల తీరు వల్ల సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. వ్యవస్థలను కూల్చాలని చూస్తే ఎవరైనా జైల్లోకి వెళ్లకతప్పదని భట్టి చెప్పుకొచ్చారు. ఇకనైనా ముఖ్యమంత్రులు ఇద్దరూ అధికార దుర్వినియోగాన్ని ఆపాలని కోరారు.