: 'పొగతాగడం హానికరం' అని ముద్రించనందుకు రూ. 750 కోట్ల జరిమానా


సంవత్సరాల తరబడి సిగరెట్లు తాగుతూ, వివిధ ప్రాణాంతక రోగాల బారిన పడ్డ వారు కోర్టులో కేసు గెలిచి రూ. 750 కోట్ల రూపాయలను పరిహారంగా పొందారు. దాదాపు 17 సంవత్సరాల పాటు కోర్టులో వాదోపవాదాల తరువాత ఈ చారిత్రక తీర్పు వెలువడింది. తాము సిగరెట్లకు బానిసలమై ఆరోగ్యాలను చెడగొట్టుకున్నామని, అందుకు సిగరెట్లు తయారు చేసిన కంపెనీలదే బాధ్యత అని ఆరోపిస్తూ, 1998లో కొంతమంది కెనడాలోని కుబెక్ ప్రావిన్స్ సుపీరియర్ కోర్టును ఆశ్రయించారు. కేసును క్షుణ్ణంగా విచారించిన కోర్టు ఇంపీరియల్ టొబాకో, బెన్సన్ అండ్ హెడ్జెస్, జేటీఐ మెక్ డోనాల్డ్ టొబాకో తదితర కంపెనీలు తప్పు చేశాయని పేర్కొంది. బాధితులకు 12 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 750 కోట్లు) పరిహారం చెల్లించాల్సిందేనని ఆదేశించింది. వాస్తవానికి కెనడాలో పొగాకు ఉత్పత్తులపై ఎటువంటి నిషేధాలూ లేవు. 'పొగతాగడం హానికరం' అన్న నినాదం పెట్టెపై ఉండాలని, అటువంటి హెచ్చరికలు జారీ చేయనందువల్ల బాధితుల అనారోగ్యానికి కంపెనీలదే బాధ్యత అని అభిప్రాయపడ్డ న్యాయమూర్తి, ఆ జరిమానాను నష్టపరిహారంగా అందించాలని తీర్పిచ్చారు.

  • Loading...

More Telugu News