: మానుకోటలో జగన్ కు, రాయినిగూడెంలో కిరణ్ కు పోరాటం రుచి చూపించారు: కడియం
తెలంగాణ ఉద్యమంలో, రాష్ట్ర సాధనలో వరంగల్ జిల్లా ప్రజల పాత్ర ఎంతో ప్రధానమైనదని టీఎస్ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. చరిత్రలో వరంగల్ ప్రజలు నిలిచిపోతారని చెప్పారు. మానుకోటలో వైకాపా అధినేత జగన్ కు, రాయినిగూడెంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ పోరాటం రుచి చూపించిన ఘనత వరంగల్ జిల్లా వాసులదేనని కొనియాడారు. రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని అన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ కే కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో ప్రసంగించిన కడియం పైవిధంగా స్పందించారు.