: ఈ ఏడు వర్షాలు తక్కువే... కరవు పొంచివుంది: కేంద్రం
ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా వర్షాలు కురుస్తాయని, దేశంలోని పలు ప్రాంతాల్లో కరవు భయాలు పొంచి వున్నాయని కేంద్రం వెల్లడించింది. దీర్ఘకాల సగటుతో పోలిస్తే, రుతుపవనాల ప్రభావం 88 శాతం మాత్రమే ఉండనుందని భూగర్భ శాస్త్ర శాఖా మంత్రి హర్షవర్థన్ మంగళవారం నాడు వ్యాఖ్యానించారు. పొలాలకు చాలినంత నీరు అందక దేశంలో కరవు ఏర్పడవచ్చని ఆయన అంచనా వేశారు. ఈ గణాంకాలు తప్పు కావాలని దేవుడిని ప్రార్థించాలని ఆయన సలహా ఇచ్చారు. కాగా, ఈ సంవత్సరం ఏప్రిల్ లో వేసిన అంచనాల మేరకు 93 శాతం వర్షపాతం నమోదవుతుందని అధికారులు వెల్లడించిన సంగతి తెలిసిందే. వర్షపాతం సరాసరి 90 శాతం కన్నా దిగువకు పడిపోతే కరవు ఏర్పడుతుంది.