: అమ్రేలీ టెక్, జై మాతాజీ సహా 13 కంపెనీలపై 'హెచ్-1బి వీసా' నిషేధం
అమెరికా కేంద్రంగా వివిధ రాష్ట్రాల్లో రిజిస్టరైన 13 కంపెనీలు హెచ్-1బి వీసాలకు దరఖాస్తు చేయకుండా ఆ దేశం నిషేధం విధించింది. గత రెండేళ్ల మాదిరిగానే ఈ సంవత్సరం సైతం హెచ్-1బి వీసాల కోసం దరఖాస్తులను ఆహ్వానించిన తొలి ఐదు రోజుల్లోనే కోటా పూర్తయింది. యూఎస్ జాబ్ వీసాకు డిమాండు అధికంగా ఉండడంతో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిపడ్డాయి. ఈ వీసాల కారణంగానే అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సంవత్సరం 13 కంపెనీలు ఎటువంటి హెచ్-1బీ వీసాలకు దరఖాస్తు చేసుకోకుండా యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం నిషేధం విధించింది. వాటిల్లో అడ్వాన్డ్స్ ప్రొఫెషనల్ మార్కెటింగ్ ఐఎన్సీ (న్యూయార్క్), అమ్రేలీ టెక్నాలజీస్ సొల్యూషన్స్ (రెడ్ మాండ్), ఏఎస్ఏపీ అమెరికా ఎల్ఎల్ సీ (యూఎస్ హైవే), డిజీ బ్లిట్జ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఫెయిర్ ఫాక్స్, వీఏ), డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఎల్ఎల్ సీ (సియాటెల్), జెండర్ సన్ స్వీట్ వాటర్ (ఫోనిక్స్, ఏజడ్), జై మాతాజీ ఎల్ఎల్ సీ (సిడార్ టౌన్, జీఏ), లైఫ్ న్యూట్రీషనల్స్ ఎల్ఎల్ సీ (ది విలేజస్, ఎఫ్ఎల్), మారథాన్ హెల్త్ కేర్ కార్పొరేషన్ (బ్రూక్లిన్), ఆర్ఎంజేఎం గ్రూప్ ఐఎన్ సీ (న్యూయార్క్), రుడెల్ అండ్ అసోసియేట్స్ ఐఎన్ సీ (లాంగ్ ఐలాండ్ సిటీ), సుప్రీమ్ టెక్ సొల్యూషన్స్ (వియన్నా), ఎక్సెల్ సొల్యూషన్స్ కార్పొరేషన్ (న్యూజర్సీ)లపై నిషేధం పడింది.