: ప్రస్తుత రాజకీయాలు కలుషితమయ్యాయి: జానారెడ్డి


తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల కొనుగోళ్ల విషయాలపై టీ.కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయాలు కలుషితమయ్యాయని, నీతి బాహ్యంగా మారాయని మీడియాతో వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు, టీడీపీ కొనుగోళ్లు రెండూ తప్పేనని పేర్కొన్నారు. తన పేరును రేవంత్ ఉటంకించడాన్ని ఖండిస్తున్నానని, నీతిమాలిన చర్యలు తానెప్పుడూ చేయలేదని జానా స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారం కోసం ఒకరు, దాన్ని లాక్కోవడానికి మరొకరు నిత్యం ఘర్షణ పడుతున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News