: జైలులో రేవంత్ ను కలసిన పయ్యావుల
టీ.టీడీపీ నేత రేవంత్ రెడ్డిని ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్ జైలులో కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ ను పరామర్శించిన ఆయన కొద్దిసేపు మాట్లాడివెళ్లినట్టు సమాచారం. 'నోటుకు ఓటు' వ్యవహారంలో అరెస్టైన రేవంత్ కు రిమాండ్ విధించగా పోలీసులు నిన్న (సోమవారం) ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే అక్కడి నుంచి చర్లపల్లి జైలుకు తరలించేందుకు ఏసీబీ అధికారులు ఈ రోజు న్యాయస్థానం నుంచి అనుమతి పొందిన సంగతి తెలిసిందే.