: ఏపీఎస్ సీ గుర్తింపు రద్దు... రణరంగంలా మారిన మద్రాస్ ఐఐటీ
మద్రాస్ ఐఐటీలో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించారంటూ అంబేద్కర్-పెరియార్ స్టడీ సర్కిల్ (ఏపీఎస్ సీ) విద్యార్థి సంఘం గుర్తింపును రద్దు చేయడంతో మొదలైన వివాదం తీవ్ర రూపు దాల్చింది. విద్యార్థులు గత మూడు రోజులుగా ఆందోళనలతో విద్యా సంస్థ ప్రాంగణాన్ని అట్టుడికిస్తున్నారు. అయితే, నేడు పోలీసులకు, విద్యార్థులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో, పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దొరికినవాళ్లను దొరికినట్టు చితకబాదారు. మీడియా ప్రతినిధులను సైతం అడ్డుకున్నారు. కాగా, ఏపీఎస్ సీ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటే తాము నిరసనలు విరమిస్తామని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు.