: చంద్రబాబుపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన జగన్
గవర్నర్ నరసింహన్ తో వైకాపా అధినేత జగన్ భేటీ అయ్యారు. కాసేపటి క్రితం రాజ్ భవన్ చేరుకున్న జగన్ గవర్నర్ తో సమావేశమయ్యారు. జగన్ తో పాటు వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూడా గవర్నర్ ను కలసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా, ఓటుకు నోటు వ్యవహారంపై గవర్నర్ తో జగన్ చర్చించారు. ఈ అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, టీడీపీకి చెందిన పలువురు నేతల ప్రమేయం ఉందని ఫిర్యాదు చేశారు. వీరిపై కూడా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.