: పోస్టర్లలో వారి ఫొటోలు ఏవీ?: సర్కారుపై టీటీడీపీ ధ్వజం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. టీడీపీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లోనూ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఈ సందర్భంగా ట్రస్ట్ భవన్ లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం వారు టీఆర్ఎస్ సర్కారుపై ధ్వజమెత్తారు. వేడుకల వేళ అమరవీరులను స్మరించుకోకపోవడం దారుణమని అన్నారు. శ్రీకాంతాచారి, కిష్టయ్య, ప్రజాగాయకులు గద్దర్, విమలక్క తదితరుల ఫొటోలు పోస్టర్లలో లేవని విమర్శించారు. పోరాటయోధులు మళ్లీ ఉద్యమం ఆరంభించాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. ఇక, చంద్రబాబు లేఖ ఇచ్చినందువల్లే తెలంగాణ ఇచ్చామని సోనియా చెప్పారని తెలిపారు.