: ఇటు ఆవిర్భావం - అటు నవనిర్మాణం


దశాబ్దాల పాటు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న ఆనందంలో తెలంగాణ ప్రజల సంబురాలు ఒకవైపు, అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టారన్న బాధతో, భవిష్యత్ దిశగా అడుగులు వేయాలన్న సంకల్పంతో నవనిర్మాణ దీక్షలు మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో సందడి చేస్తున్నాయి. ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా జరిపేందుకు తెలంగాణ సర్కారు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే వేడుకల్లో టీ-ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పాల్గొన్నారు. మిగతా అన్ని జిల్లాల్లో సైతం గత రాత్రి నుంచే బాణసంచా మెరుపులు, విద్యుద్దీప కాంతులతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పలు భవనాలు, రహదారులు మెరిసిపోతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని అన్ని కూడళ్లూ తళుకులీనుతున్నాయి. ప్రజలు ఆనందంగా ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఈ స్థాయిలో కాకపోయినా, నవనిర్మాణ దీక్షల పేరిట పునరంకిత సభలు అన్ని జిల్లాల్లోనూ జరుగుతున్నాయి. విజయవాడలో స్టెల్లా కాలేజీ నుంచి బెంజి సర్కిల్ వరకూ ప్రజలు బారులుతీరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇక్కడికి పాదయాత్రగా వచ్చి ప్రజలతో ప్రమాణం చేయించనున్నారు. అనంతపురంలో జరిగిన నవనిర్మాణ దీక్షలో మంత్రి పరిటాల సునీత ప్రసంగించారు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖ తదితర నగరాల్లోనూ ఈ దీక్షలు జరుగుతున్నాయి.

  • Loading...

More Telugu News