: ఏపీ, తెలంగాణ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ గ్రీటింగ్స్!


భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ లో గ్రీటింగ్స్ సందేశాలను పోస్ట్ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ది బాట పట్టించేందుకు ఏపీ ప్రజలు అహరహం శ్రమిస్తున్నారని తన సందేశంలో ప్రశంసించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు సూచించారు. అభివృద్ధి పథంలో రాష్ట్రం దూసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. ఇరు రాష్ట్రాల ప్రజలను ఆయన 'సోదర, సోదరీమణులు' అంటూ తన సందేశంలో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా సందేశాలు పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News