: నేడు తెలంగాణ ఆవిర్భావ దినం... రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు


దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణ, నేడు తన తొలి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. రాజధాని హైదరాబాదుతో పాటు అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లోనూ వేడుకలకు ఏర్పాట్లు చేసింది. వేడుకల్లో భాగంగా నేటి ఉదయం 9.30 గంటలకు హైదరాబాదులోని సికింద్రాబాదు పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అంతేకాక రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ఆయన కీలక ప్రసంగం చేయనున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 7 దాకా వేడుకలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News