: కత్తితో గొంతుకోసి, అదే కత్తితో కేక్ కట్ చేసిన ఘనుడు చంద్రబాబు: హరీశ్ రావు


టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు విరుచుకుపడ్డారు. చంద్రబాబు... కత్తితో మామ ఎన్టీఆర్ గొంతుకోసి, అదే కత్తితో కేక్ కట్ చేసి విజయోత్సవం జరుపుకున్నాడని విమర్శించారు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత చంద్రబాబుకు లేదని అన్నారు. చంద్రబాబు అవినీతిని ప్రజలు మర్చిపోరని దుయ్యబట్టారు. అసలు, రేవంత్ రెడ్డి వ్యవహారంలో చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలని నిలదీశారు. రాజకీయ వ్యభిచారానికి పాల్పడింది టీఆర్ఎస్ కాదని, టీడీపీయేనని అన్నారు. అభ్యర్థిని గెలిపించుకునే బలం లేకున్నా టీడీపీ పోటీకి పెట్టడమేంటని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News