: రేవంత్ అనుచరుడిని తుపాకీతో బెదిరించి డబ్బులు తీసుకువచ్చేలా చేశారు: నరేందర్ రెడ్డి
రేవంత్ రెడ్డిని కావాలనే ఓటుకు నోటు వ్యవహారంలో ఇరికించారని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అనుచరుడిని తుపాకీతో బెదిరించి స్టీఫెన్ సన్ ఇంటికి డబ్బులు తీసుకువచ్చేలా చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి... కుట్రకు బలయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను కొని ఐదో అభ్యర్థిని గెలిపించుకున్నారని అన్నారు. ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి తెలంగాణ ఏమీ కేసీఆర్ జాగీరు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. తెలంగాణ శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి ఓటమిపాలైన సంగతి తెలిసిందే.