: బానిస బతుకులు ఇక చాలు... టీడీపీని వదిలేయండి: జోగు రామన్న
తెలంగాణ టీడీపీ నేతలవి బానిస బతుకులని మంత్రి జోగు రామన్న విమర్శించారు. ఇకనైనా బానిస బతుకులకు స్వస్తి చెప్పి, టీడీపీని వీడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజకీయ పబ్బం కోసం ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణలో కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఓటు కోసం తమ ఎమ్మెల్యేకి టీడీపీ డబ్బు ఇవ్వాలనుకోవడం అప్రజాస్వామికం అని చెప్పారు. తనను చంద్రబాబే పంపించారని రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యలు వీడియోలో రికార్డయ్యాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించే అర్హత ఎర్రబెల్లి దయాకర రావుకు లేదని... ఎర్రబెల్లి తెలంగాణ ద్రోహి అని అన్నారు.