: ఎందరో మహనీయుల త్యాగఫలితమే తెలంగాణ: గవర్నర్ నరసింహన్


రేపు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ గవర్నర్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకను ఘనంగా జరుపుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఎందరో మహనీయులు తెలంగాణ సాధన కోసం ప్రాణాలను సైతం అర్పించారని... వారి త్యాగఫలితమే తెలంగాణ అని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం త్యాగం చేసిన వారందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. బంగారు తెలంగాణ లక్ష్యంతో అందరం కలసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News