: రేవంత్ వ్యవహారంపై మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు స్పందన


సచివాలయంలో జరిగిన ఏపీ క్యాబినెట్ భేటీలో రేవంత్ రెడ్డి ప్రస్తావన వచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు మంత్రులతో రేవంత్ వ్యవహారం గురించి మాట్లాడారు. 63 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీఆర్ఎస్... ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదుగురిని ఎలా నిలబెడుతుందని చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలుపై ఆధారపడే టీఆర్ఎస్ ఐదుగురిని నిలబెట్టిందని ఆయన అభిప్రాయపడ్డారు. దొంగే... దొంగ అన్న రీతిలో టీఆర్ఎస్ వ్యవహరించిందని మంత్రులతో అన్నారు. టీడీపీని తెలంగాణలో అప్రదిష్ఠపాల్జేయాలన్నదే టీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News