: అది ఏపీ సొమ్మే: టీడీపీపై రఘువీరా ధ్వజం
రేవంత్ రెడ్డి వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీకి ఓ అస్త్రం దొరికినట్టయింది. దాంతో, ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి టీడీపీపై ధ్వజమెత్తారు. ఏపీ సొమ్ముతోనే తెలంగాణ ఎమ్మెల్యేలను కొంటున్నారని మండిపడ్డారు. ఏపీలో అక్రమంగా సంపాదిస్తున్నారని, మహానాడు కూడా అలా సంపాదించిన సొమ్ముతోనే నిర్వహించారని ఆరోపించారు. రాష్ట్రంలో కోట్లు కొల్లగొడుతున్నారని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలిలో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి కేవీపీ రామచంద్రరావు, కనుమూరి బాపిరాజు తదితరులు హాజరయ్యారు.