: జయలలిత కేసులో కొత్త మలుపు!


ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టుకున్నారన్న కేసులో శిక్షను సస్పెండ్ చేయించుకోవడంలో విజయవంతమై తిరిగి తమిళనాడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన జయలలిత కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కోర్టు తీర్పును సవాలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అతిత్వరలోనే శిక్ష అమలు నిలిపివేయడంపై పిటిషన్ దాఖలు చేయనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఒకవేళ ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించి, శిక్ష అమలుపై స్టేను నిలిపివేసిన పక్షంలో, జయలలిత మరోసారి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News