: తెలంగాణలో సంబరాలు, ఆంధ్రాలో సంవత్సరీకాలు: ఉండవల్లి


తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్న ఆనందోత్సాహాల నడుమ ఆ రాష్ట్ర ప్రజలు సంబరాలు జరుపుకునేందుకు సిద్ధమైన వేళ, ఏపీ ప్రజలు సంవత్సరీకాలు జరుపుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఒత్తిడి తెచ్చేందుకు వైకాపాను కలుపుకుపోవాలని బాబు సర్కారుకు ఆయన సలహా ఇచ్చారు. కేసీఆర్ స్వయంగా పూనుకోబట్టే, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కొనుగోలు అవినీతి బాగోతం బట్టబయలైందని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన వివరాలను బట్టి చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో ఇలాంటి కేసుల్లోనే పీవీ నరసింహరావును కూడా ముద్దాయిగా చేర్చారని ఉండవల్లి గుర్తు చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఇది బలమైన కేసని, రేవంత్ కు తెలియకుండా ఈ వ్యవహారం మొత్తం రికార్డు అయినందున ఆయన మాటలకు కోర్టులో విలువ ఎక్కువగా ఉంటుందని అన్నారు.

  • Loading...

More Telugu News