: స్టీఫెన్ ఇళ్లంతా కెమెరాలే... రకరకాల ఏంగిల్స్ లో రేవంత్ వీడియోలు!


టీటీడీపీ ఫైర్ బ్రాండ్ గా రేవంత్ రెడ్డి పేరుగాంచారు. ప్రెస్ మీట్ కానీ, అసెంబ్లీ సమావేశాలు కానీ, మరెక్కడైనా సరే... అధికార టీఆర్ఎస్ పై పదునైన విమర్శలను ధైర్యంగా విసరడంలో రేవంత్ దిట్ట. అనేక సార్లు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రికి సైతం సవాల్ విసరగల దమ్మున్న నేత. ఈ నేపథ్యంలో, రేవంత్ రెడ్డిని పక్కా ప్రణాళికతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఉదంతంలో ఆశ్చర్యం గొలిపే విషయాలు బయటపడుతున్నాయి. టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ ఇంటి నిండా ఏసీబీ అధికారులు కెమెరాలను అమర్చారు. గదిలోని ప్రతి అంగుళాన్ని కవర్ చేసేలా... ఎన్నో కెమెరాలు. లాంగ్ షాట్, క్లోజ్ షాట్... ఇలా ఎన్నో యాంగిల్స్ లో కెమెరాలను ఏర్పాటు చేశారు. రేవంత్ ఒక సోఫాలో కూర్చుంటే కొన్ని కెమెరాలు కవర్ చేస్తాయి... సీటు మారి ఇంకో చోట కూర్చుంటే వేరే కెమెరాలు కవర్ చేస్తాయి. రేవంత్ మాట్లాడే సమయంలో ఏ ఒక్క అంశం కూడా మిస్ కాకుండా కెమెరాలను ఏర్పాటు చేశారు. మోషన్ కెమెరాలను కూడా పెట్టారు. కేవలం రేవంత్ ముఖం మాత్రమే కనబడేలా కూడా కెమెరాలు అమర్చారంటే... ఎంత పక్కాగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News