: అసెంబ్లీ టు ఆసుపత్రి టు చర్లపల్లి... ఏసీబీ బిజీబిజీ!
తెదేపా నేత రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి 14 రోజుల రిమాండును విధించడం, జైలుకు తరలించే ముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయించాలని, ఆపై ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, అవసరమైతే చికిత్స చేయించాలని ఆదేశించిన నేపథ్యంలో ఏసీబీ బిజీ అయింది. భారీ కాన్వాయ్, భద్రత నడుమ ఈ ఉదయం 9 గంటలకు ఓటేసే నిమిత్తం రేవంత్ ను అసెంబ్లీకి తీసుకువచ్చిన ఏసీబీ ఓటింగ్ అనంతరం ఆయన్ను ఆసుపత్రికి తరలించనుంది. కేర్ లేదా అపోలో ఆసుపత్రికి ఆయన్ను తీసుకువెళ్లవచ్చని తెలుస్తోంది. ఆపై వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను రిమాండు నిమిత్తం చర్లపల్లి జైలుకు తరలించనున్నారు.