: అసెంబ్లీకి వచ్చిన రేవంత్... పరామర్శల వెల్లువ
ఎమ్మెల్యేను ప్రలోభపెట్టిన కేసులో 14 రోజుల రిమాండును ఎదుర్కొంటున్న టీడీపీ నేత రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే నిమిత్తం పోలీసులు అసెంబ్లీకి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డిని చూడగానే తెలుగుదేశం నేతలు ఒక్కసారిగా ఆయన్ను చుట్టుముట్టి పరామర్శించారు. తామంతా నీ వెనకే ఉన్నామంటూ భరోసానిచ్చారు. ఓటేసిన తరువాత అసెంబ్లీ నుంచి ఆయన్ను డైరెక్టుగా చర్లపల్లి జైలుకు తరలించనున్నట్టు తెలిసింది. ఆపై చర్లపల్లి జైలు ఆసుపత్రిలో ఆయనకు వైద్య సహాయం అందించాలని, అక్కడి డాక్టర్ల సలహా మేరకే తదుపరి అందించాల్సిన వైద్య సేవలపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. కాగా, తెలంగాణ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఇప్పుడిప్పుడే అసెంబ్లీకి వస్తున్నారు. ఈ ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్థులకు ఎంఐఎం, వైకాపాలు మద్దతు పలికిన సంగతి తెలిసిందే.