: ట్రైలర్ కోసం సినిమాకు వెళ్తున్న ప్రేక్షకులు!
బాహుబలి... రెండు సంవత్సరాలుగా సినీ ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలను పెంచిన చిత్రం. ఈ చిత్రం ట్రైలర్ నేటి ఉదయం రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో 'బాహుబలి ట్రైలర్ ప్రదర్శించబడును' అంటూ బీ, సీ సెంటర్లలో ప్రత్యేక పోస్టర్లు సైతం వెలిశాయి. దీంతో ట్రైలర్ చూడడం కోసమే ప్రభాస్, రాణా, రాజమౌళి అభిమానులు థియేటర్ల వద్దకు చేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కాగా, డాల్బీ అట్మాస్ లో విడుదలయ్యే ట్రైలర్ ను హైదరాబాద్ ప్రసాద్స్ లోని స్క్రీన్ నెంబర్ -4లో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ట్రైలర్ నిడివి 2 నుంచి మూడు నిమిషాల్లోపే ఉంటుందని, ముఖ్యమైన పాత్రల పరిచయం, కొన్ని డైలాగులు ఉంటాయని సమాచారం.