: ఏసీబీ న్యాయమూర్తి ముందుకు రేవంత్


ఈ ఉదయం 8 గంటల సమయంలో ఏసీబీ న్యాయమూర్తి లక్ష్మీపతి ఎదుట టీడీపీ నేత రేవంత్ రెడ్డి సహా ముగ్గురిని ఏసీబీ అధికారులు ప్రవేశపెట్టారు. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రూ. 5 కోట్ల లంచాన్ని ఇవ్వజూపిన కేసులో నిన్న ఆయన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ నుంచి స్వాధీనం చేసుకున్న రూ. 50 లక్షలతో పాటు ఆడియో, వీడియో సాక్ష్యాలను ఏసీబీ అధికారులు జడ్జి ముందు ప్రవేశపెట్టారు. ఎఫ్ఐఆర్ కాపీలను రేవంత్ తరపు న్యాయవాదులకు అందజేశారు. ప్రస్తుతం కేసులో వాదనలు జరుగుతున్నాయి. రేవంత్ కు తక్షణం బెయిలు వచ్చే అవకాశాలు లేకపోవడంతో, రిమాండు విధించగానే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతించాలని రేవంత్ తరపు న్యాయవాదులు, తదుపరి విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు పిటీషన్లు దాఖలు చేయనున్నారు.

  • Loading...

More Telugu News