: రేవంత్ కు తొలి నిద్రలేని రాత్రి... నేటి నుంచి చర్లపల్లి జైల్లోనే!


పక్కాగా ఆడియో, వీడియో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి ముందుకు ఎన్నో నిద్రలేని రాత్రులు రానున్నాయి. నిన్న సాయంత్రం అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేసి తమ కార్యాలయానికి తరలించి, మరిన్ని వివరాల కోసం ఇంటరాగేషన్ ప్రారంభించారు. రాత్రి ఒంటి గంట సమయంలో వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రాత్రంతా ఆయన నిద్రపోకుండా అసహనంతో గడిపినట్టు తెలుస్తోంది. ఆయన్ను నేడు మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. రేవంత్ పై అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్‌ 12 (లంచం ఇవ్వజూపడం, ప్రలోభ పెట్టడం), ఐపీసీ - 120 బి, 34 కింద కేసు నమోదు చేశామని, ఈ కేసు నాన్‌ బెయిలబుల్‌ అని ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో తక్షణం బెయిలు లభించే అవకాశాలు లేనట్టే. ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు అనుమతించినా, ఆ వెంటనే రేవంత్ ను రిమాండ్ నిమిత్తం చర్లపల్లి జైలుకు తరలించే అవకాశాలే అధికమని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News