: డబ్బుతో ఏదైనా కొనొచ్చు అనుకునే స్వభావం చంద్రబాబుది: తలసాని
టీడీపీ క్యాంపులో ఉన్న ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి బయటకు ఎలా వచ్చారని టీఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ఎక్కడకు రమ్మంటే అక్కడకు రావడానికి రేవంత్ రెడ్డి చిన్న పిల్లవాడు కాదు కదా? అని అన్నారు. ఏసీబీ అదుపులోకి తీసుకునే సమయంలో రేవంత్ రూ. 50 లక్షలు ఇస్తున్నట్టు తాను కూడా మీడియాలోనే చూశానని... కాసేపు ఆగితే విచారణ జరుపుతున్న వారే పూర్తి వివరాలు వెల్లడిస్తారని చెప్పారు. డబ్బుతో ఏదైనా సాధించవచ్చనే పాలసీ టీడీపీ అధినేత చంద్రబాబుదని చెప్పారు. గతంలో కూడా తాను అనేక సార్లు ఈ విషయాన్ని తెలిపానని అన్నారు.