: ఐటీ అధికారులకు సమాధానం చెప్పకపోతే రూ. 2 లక్షల ఫైన్
ఇకపై ఐటీ అధికారులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు తెలపాల్సి ఉంటుంది. లేకపోతే రూ. 2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఇటీవల రాష్ట్రపతి ఆమోదం పొందిన నల్లధన చట్టంలో ఈ మేరకు నిబంధనలను పొందుపరిచారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి రానుంది. ఐటీ అధికారులు జారీ చేసే సమన్లకు సరైన సమాధానాలు ఇవ్వకపోతే సమస్యల్లో ఇరుక్కున్నట్టే.